9, ఏప్రిల్ 2024, మంగళవారం

సాహతీ దర్బారు

 శ్రీ  విఘ్న రాజాయ నమః      శ్రీ  మాత్రే నమః   శ్రీ గురుభ్యోన్నమః   



        తెలుగు కావ్య మథనము  బ్లాగుకు                                     స్వాగతము



                శ్రీ గజముఖునికి ముందుగా చేతులెత్తి 

              దండములను‌ నే జేయుచు ‌దయను జూప 

              మనుచు ప్రార్ధించి బ్లాగును ఘనముగాను 

              మొదలు బెట్టితి జనులకు ముదము గూర్చ


                                                                   పూసపాటి 





శార్దూలము 
    

 శ్రీ విఘ్నేశ! వినాయకా! గణపతీ!, శ్రీ పాద యుగ్మమ్ముకున్,

సేవా తత్పర భావ చింతన‌ముతో  జేయంగ బూజల్,సదా

             పోవున్విఘ్నము  లీజగంబున.,భయంబున్ మాన్పి, యీ బ్లాగులో  

నా విద్యార్దుల కండగా నిలచి జ్ఞానంబున్ ప్రసాదించు‌ మా





  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్రీ వినాయక 

అందరికి   క్రోధి   నామ‌ వత్సర.  శుభాకాంక్షలు

ఇవాళ నుంచి  మన. సమూహములో  శ్రీ  ఆదిభట్ల సత్యనారాయణ గారు   నృసింహ శతకములోని  పద్యము ఒకటి  తన గళము ద్వారా  పఠనము చేసి  దాని   తాత్పర్యం  కూడా  మనకు  తెలియ పరుస్తారు   ఆస్వాదించండి   పద్య మథనము  ప్రారంభము  చేద్దామ్

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


[03:09, 09/04/2024] PKS Kumar: సీసము

శ్రీ మనోహర! సురార్చిత!సింధుగంభీర!
        భక్తవత్సల! కోటి భానుతేజ!
కంజనేత్ర ! హిరణ్యకశిపాంతక !శూర !
         సాధురక్షణ! శంఖ చక్ర హస్త!
ప్రహ్లాద వరద!పాప ధ్వంసం! సర్వేశ!
           క్షీర సాగర శయన! కృష్ణ వర్ణ!
 పక్షి వాహన నీల భ్రమరకుంతల జాల!
           పల్లవారుణ పాదపద్మయుగళ!

తేటగీతి

చారు శ్రీ చందనాగురు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ!దురిత దూర!

భావము

ఆభరణములచే ప్రకాశించువాడవు,శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు,విపత్తులను రూపు మాపుమాపి దుష్టులను సంహరించు వాడవు నగు ఓ నరసింహస్వామీ!
     నీవు శ్రీ దేవికి భర్తవు.దేవతలచే పూజింప బడువాడవు.భక్తులను బ్రోచువాడవు.కోటిసూర్యుల తేజముతో ప్రకాశించు వాడవు.
పద్మములవంటి కన్నులు గలవాడవు.చేతులందు శంఖ చక్రములు గలవాడవు.హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని బ్రోచినావు. సన్మార్గుల రక్షకుండవు.నల్లని కేశపాశములు కలవాడవు.చిగురాకులవంటి ఎర్రని పాదపద్మద్వయము కలవాడవు.మంచిగంధము మొదలగు సుగంధ ద్రవ్యములు శరీరమునను పూయబడిన వాడవు.మల్లెమొగ్గలవంటి పలువరుస గలవాడవు.వైకుంఠమందుండు వాడవు.

సాహతీ దర్బారు

  శ్రీ  విఘ్న రాజాయ నమః      శ్రీ  మాత్రే నమః   శ్రీ గురుభ్యోన్నమః             తెలుగు కావ్య మథనము  బ్లాగుకు                                 ...